![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -324 లో..... లాస్ట్ టైమ్ ఆ గంగ వల్లే మనం బెట్టింగ్ లో లాస్ అయ్యాం.. తన ప్రత్యర్థి పై గెలుస్తుందని బెట్టింగ్ పెట్టాం కానీ గంగ గెలిచింది. ఇప్పుడు మనం గంగ గెలుస్తుందని బెట్టింగ్ వేద్దామని బెట్టింగ్ నిర్వాహకులు అంటారు. అలా వద్దు అసలు గంగ పోటీ చెయ్యదు.. తనకి పర్మినెంట్ ఫుల్ స్టాప్ పెడుదామనుకుంటున్నానని వీరు అంటాడు. దాంతో వాళ్ళు షాక్ అవుతారు.
మీరు విన్నది నిజమే.. ఇన్నాళ్లుగా నేను చెప్పింది చేస్తూ వచ్చారు.. ఇక ముందు కూడా నేను చెప్పింది చెయ్యండి అని వీరు చెప్తాడు. ఆ మాటలన్నీ అక్కడ కాఫీలు అందిస్తూ ఒకతను చాటు నుంచి వింటాడు. వీరు వచ్చి అంతా విన్నావా అని అడుగుతాడు. వీడు పోటీ అయ్యేవరకు బయటకు రాకూడదని వీరు వేరొకతనికి చెప్తాడు. మరొకవైపు గంగ గుడికి వెళ్తుంది. అక్కడ ఒక స్వామి వేరొకరికి సమస్య పరిష్కారం చెప్పడం చూస్తుంది. గంగ చూసి అతని దగ్గరికి వెళ్లి మా ఆయన కల నిజం చేస్తానా అని అడుగుతుంది. చేస్తావ్ తల్లి కొన్ని కష్టాలు తప్పవని చెప్తాడు. మీ ఆయనతో కలిసి మృత్యుంజయ హోమం చేస్తే మీకు జరిగే ఆపదల నుండి బయటపడొచ్చని చెప్తాడు. ఆ తర్వాత గంగ ఇంటికి వెళ్లి అక్కడ స్వామి ఉన్నాడు చాలా పవర్ ఫుల్ అని చెప్తుంది.
ఇంట్లో జరుగుతున్న ఎటాక్ కి హోమం జరిపించాలని ఆ స్వామి చెప్పాడు.. మనం చేద్దామని గంగ అంటుంది. అవన్నీ వద్దని రుద్ర అంటుంటే ఎందుకు వద్దు జరిపిద్దామని శకుంతల అనగానే రుద్ర ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెద్దసారు పంతులు దగ్గరికి వెళ్లి రుద్ర , గంగ జాతకం ఇచ్చి చూడమని చెప్తాడు. అందులో ఏమైనా దోషాలు ఉంటే చెప్పండి పరిహారం చేపిద్దామని పెద్దసారు అంటాడు. అప్పుడే శకుంతల వస్తుంది. ఎందుకు మీ రుద్ర అంటే అంత ఇష్టం.. మన కొడుకు లేడన్న బాధ లేదు ఇంట్లో ప్రెగ్నెంట్ అయిన కూతురు ఉంది.. తన గురించి పట్టదని శకుంతల అంటుంది. నా తర్వాత కుటుంబాన్ని నడిపించేది రుద్ర మాత్రమే అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |